boviX Knowledge Series

boviX Knowledge Series

నేను డాక్టర్ ఆవుల సాయి మహేష్ రెడ్డి. వృత్తిరీత్యా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్నప్పటికీ, నా ఆలోచనలు ఎప్పుడూ పశుపోషణ రంగంలో కొత్త మార్పులు తీసుకురావడం చుట్టూనే తిరుగుతుంటాయి. రైతులకు ఉపయోగపడే ఏ చిన్న ఆలోచన వచ్చినా దాన్ని ఆచరణలో పెట్టాలనే తపన నాలో ఉంటుంది. అందులో భాగంగానే boviX యాప్‌ను ప్రారంభించాను. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పశుపోషణకు అనుసంధానం చేసి రైతులకు మరింత చేరువ చేయాలన్నది నా ప్రయత్నం. Friendly Vet YouTube ఛానల్, WhatsApp సేవల ద్వారా శాస్త్రీయ పశువైద్య విజ్ఞానాన్ని రైతులతో పంచుకుంటున్నాను. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు ఒక స్టార్టప్‌ను నిర్మించడం అంత సులభం కాదని తెలుసు. అయినా ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు ఎదురైనా నా ఆలోచనలపై నమ్మకంతో ముందుకు సాగుతున్నాను. నాకు కావాల్సింది కేవలం ఒక విజయవంతమైన వ్యాపారం కాదు. రైతుల జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలి, పశుపోషణను లాభసాటిగా మార్చాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో టెక్నాలజీకి ఒక కొత్త స్థానం కల్పించాలి. అదే నా ప్రయాణం, అదే నా కల.

పుస్తకాలు